
టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ స్ధానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. ఆసీస్ టూర్ నుంచి వన్డే సారథిగా గిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. భారత వన్డే కెప్టెన్‌గా ఎంపికైన 28వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత జట్టు వన్డే కెప్టెన్‌గా పనిచేసిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.
అజిత్ వాడేకర్: వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి ఆటగాడు. అతడి నాయకత్వంలో 1974లో భారత్ రెండు వన్డేలు ఆడింది.

శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్: శ్రీనివాసరాఘవన్ ఏడు వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.

బిషన్ సింగ్ బేడి: లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి నాలుగు వన్డే మ్యాచ్‌లలో భారత్‌ను నడిపించాడు.

సునీల్ గవాస్కర్: 1980 నుండి 1985 వరకు సునీల్ గవాస్కర్ నాయకత్వంలో భారత్ 37 వన్డే మ్యాచ్‌లు ఆడింది.

గుండప్ప విశ్వనాథ్: 1981లో గుండప్ప విశ్వనాథ్ ఒక వన్డే మ్యాచ్‌కు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
కపిల్ దేవ్: కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 74 వన్డేలు ఆడింది. అతడి కెప్టెన్సీలోనే 1983 ప్రపంచ కప్‌ను టీమిండియా గెలుచుకుంది.

సయ్యద్ కిర్మాణి: 1983లో సయ్యద్ కిర్మాణి ఒక వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.

మోహిందర్ అమర్‌నాథ్: 1984లో మోహిందర్ అమర్‌నాథ్ ఒక వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

రవిశాస్త్రి:1986 నుండి 1991 వరకు 11 వన్డే మ్యాచ్‌లకు రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్‌గా పనిచేశాడు.

దిలీప్ వెంగ్‌సర్కార్: 1987 నుండి 1998 వరకు దిలీప్ వెంగ్‌సర్కార్ నాయకత్వంలో భారత్ 18 వన్డేలు ఆడింది.

కృష్ణమాచారి శ్రీకాంత్: 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అజారుద్దీన్: మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ 174 వన్డే మ్యాచ్‌లు ఆడింది.
సచిన్ టెండూల్కర్: లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 1996 నుండి 1999 వరకు 73 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ అతడి కెప్టెన్సీలో 23 మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది.

అజయ్ జడేజా: అజయ్ జడేజా భారత కెప్టెన్‌గా 13 వన్డేల్లో వ్యవహరించాడు. కెప్టెన్‌గా 8 విజయాలను అందుకున్నాడు.
సౌరవ్ గంగూలీ: 1999 నుండి 2005 వరకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ 146 వన్డేలు ఆడి 76 గెలిచింది.
రాహుల్ ద్రవిడ్: 2000 నుండి 2007 వరకు 79 వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించిన ద్రవిడ్ 42 మ్యాచ్‌లను గెలిపించాడు.

అనిల్ కుంబ్లే: 2002లో కుంబ్లే భారత కెప్టెన్‌గా ఒకే ఒక వన్డే మ్యాచ్‌లో వ్యవహరించాడు.

వీరేంద్ర సెహ్వాగ్: వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలో భారత్ 12 వన్డేలు ఆడి 7 విజయాలు సాధించింది.

ఎంఎస్ ధోని: వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. 2007 నుంచి 2018 వరకు అతడి సారథ్యంలో 200 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 110 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అతడి నాయకత్వంలో భారత్ ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

సురేష్ రైనా: 2010 నుండి 2014 వరకు 12 వన్డేల్లో రైనా భారత్‌కు నాయకత్వం వహించాడు.

గౌతమ్ గంభీర్: ప్రస్తుత హెడ్‌కోచ్ భారత కెప్టెన్‌గా ఆరు వన్డేల్లో వ్యవహవరించాడు. మొత్తం అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ: 2013 నుండి 2021 వరకు భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించాడు. అతడి సారథ్యంలో 95 వన్డేలు ఆడిన భారత్ 65 విజయాలు సాధించింది.

అజింక్య రహానే: 2015లో, అజింక్య రహానే మూడు వన్డే మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.

రోహిత్ శర్మ: రోహిత్ శర్మ 2017 నుండి 2025 వరకు 56 వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. 42 మ్యాచ్‌లలో భారత్ గెలుపొందింది. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

శిఖర్ ధావన్: మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ కూడా 12 మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కెఎల్ రాహుల్: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.

హార్దిక్ పాండ్యా: రోహిత్ శర్మ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా మూడు వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
శుభ్‌మన్ గిల్: అక్టోబర్ 19న పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్ శకం మొదలు కానుంది.