
టీమిండియా వెటరన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లెజండరీ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్(Parvez Rasool) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల పర్వేజ్ సోమవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచిన రసూల్.. ఇకపై కోచింగ్ కెరీర్‌పై సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. రసూల్ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో లెవల్-2 కోచింగ్ సర్టిఫికేట్ పూర్తి చేశాడు.
"నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. భారత జట్టుకు అత్యున్నత స్ధాయి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ పరంగా వెనకబడిన జమ్మూ కాశ్మీర్ నుంచి రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డును సొంతం చేసుకున్నాను.
అదేవిధంగా ఐపీఎల్‌లో కూడా జమ్మూ నుంచి ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. నా కెరీర్‌లో ఇవన్నీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే భారత్‌కు టెస్టు ఫార్మాట్‌లో ప్రాతినిథ్యం వహంచలేకపోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (చెన్నైలో, ఫిబ్రవరి 2013) బోర్డు ప్రెసిడెంట్స్ XI తరపున ఏడు వికెట్లు తీసిన తర్వాత నాకు సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని ఆశించాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. ఇకపై కోచ్‌గా నా కెరీర్‌ను ఆరంభించాలని అనుకుంటున్నాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో రసూల్ పేర్కొన్నాడు.
కాగా పర్వేజ్ రసూల్ భారత్ తరపున 2014 ఒక టీ20, 2017లో వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పర్వేజ్.. 3 వికెట్లు, 5 పరుగులు సాధించాడు. రైనా కెప్టెన్సీలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రసూల్.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ జమ్మూ కాశ్మీర్ దిగ్గజం ఐపీఎల్‌లో పుణె వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తరపున కూడా ఆడాడు.
చదవండి: రిజ్వాన్‌పై వేటు.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?