
ఆసియాలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఆసియా కప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్ 'బి'లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.
ప్రతీ గ్రూపు నుంచి టాప్-2 టీమ్స్ సూపర్ ఫోర్ స్టేజికి చేరుకుంటాయి. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆసియాకప్-2023ను భారత్ సొంత చేసుకుంది. కానీ అది వన్డే ఎడిషన్ కావడం గమనార్హం. చివరగా 2022లో జరిగిన ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. అయితే గత ఎడిషన్ కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఆసియాకప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతంతంటే?
ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు తెలుస్తోంది.
గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం కావడం గమనార్హం. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రైజ్‌మనీపై ఏసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఈవెంట్‌లో భారత తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఈఏతో ఆడనుంది.
చదవండి: 'సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో బెటర్.. అద్భుతాలు సృష్టిస్తాడు'