జోయలుక్కాస్‌ నమ్మకమైన బ్రాండ్‌ | - | Sakshi
Sakshi News home page

జోయలుక్కాస్‌ నమ్మకమైన బ్రాండ్‌

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

హన్మకొండ: జోయలుక్కాస్‌ అంటేనే నమ్మకమైన బ్రాండ్‌ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుక్కాస్‌ హనుమకొండ నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన రెండో షోరూంను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కె.ఆర్‌.నాగరాజుతో కలిసి ప్రారంభించారు. షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. సినీ నటి అంతారా స్వర్ణకార్‌ షోరూం ఓపెనింగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు ఆభరణాలు అందించాలన్నారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్‌ 40 దేశాల్లో 190 షోరూంలు కలిగి ఉందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్నదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్‌లను అందిస్తోందన్నారు. జోయ లుక్కాస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. కస్టమర్‌ డిమాండ్‌ను అందుకోవడానికి బ్రాండ్‌ బలమైన నిబద్ధతను ఈ విస్తరణ నొక్కి చెబుతుందన్నారు. జోయలుక్కాస్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృతి శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్‌ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్‌ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్‌ అందిస్తోందన్నారు. తమ షోరూంల ద్వారా అందిస్తున్న ఆభరణాలు పై నమ్మకాన్ని బలోపేతం చేయడానికి వ్యాపార విస్తరణలో భాగంగా తమ చైర్మన్‌ జోయలుక్కాస్‌ కొత్తగా షోరూంలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జోయలుక్కాస్‌ సీఓఓ హెన్రీ జార్జ్‌, మార్కెటింగ్‌ హెడ్‌ అనిశ్‌ వర్గీస్‌, రిటైల్‌ హెడ్‌ రాజేశ్‌ కృష్ణన్‌ పాల్గొన్నారు.

వినియోగదారులకు సరసమైన ధరలకు

అందించాలి

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement