దొంగల ముఠా అరెస్ట్‌.. | - | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్‌..

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

హసన్‌పర్తి : వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్ప డుతున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా వంగపల్లి వద్ద సీసీఎస్‌, కమలాపూర్‌ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. పె ద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ తారకరామ కాలనీకి చెందిన సిరిగిరి ప్రసాద్‌, మంచిర్యాల జిల్లా చున్నంబట్టి కాలనీకి చెందిన మోతె రాజు, గోదావరిఖని ప్రగతినగర్‌కు చెందిన టేకు నవీన్‌, మంచిర్యాల టౌన్‌కు చెందిన వారణాసి లక్ష్మణ్‌, మంచిర్యాల జిల్లా గాంఽధీనగర్‌కు చెందిన మోటం తిరుపతి, మోటం నరేశ్‌, మంచిర్యాల జిల్లా భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన వస్తం భీమేశ్‌ ముఠాగా ఏర్పడ్డారు. మద్యానికి బానిసైన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు వ్యవసాయ బావులు, కాల్వల వద్ద అమర్చిన మోటార్లను అపహరిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో వరంగల్‌ పోలీస్‌ కమి షనరేట్‌ పరిఽధిలోని కమలాపూర్‌, దామెర పోలీస్‌స్టేషన్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పీఎస్‌ పరిధిలోని కేశవపట్నంలో మోటార్లు అపహరించారు.

ఫిర్యాదు మేరకు రంగంలోకి..

ఆయా గ్రామాల రైతుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కమలాపూర్‌ మండలం వంగపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఆటో ట్రాలీ, కారును తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని వి చారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. దీంతో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం చేసుకుని ఆటోట్రాలీ, కారు సీజ్‌చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులకు నేర చరిత్ర ఉందని డీసీపీ చె ప్పారు. కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల వైర్‌ను అపహరించిన కేసుల్లో నిందితులు జైలుకెళ్లారని డీసీపీ తెలిపారు.

పోలీసు అధికారులకు అభినందనలు..

కేసును ఛేదించిన సీపీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, రామకృష్ణ, కమలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఐటీ కోర్‌ టీం ఏఏఓ మహ్మద్‌ సల్మాన్‌ పాషా, ఎస్సై శ్రీనివాస్‌, రాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ నసీమ్‌ మహ్మ ద్‌, మహేశ్వర్‌, జంపయ్య, విశ్వేశ్వర్‌, వంశీ, వినోద్‌, కమలాపూర్‌ ఎస్సై దిలీప్‌ను డీసీపీ అభినందించారు. సీపీఎస్‌, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం

ఆటో ట్రాలీ, కారు సీజ్‌

వివరాలు వెల్లడించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement