అర్హతలు..
శారీరక సామర్థ్య పరీక్షలు
భూపాలపల్లి అర్బన్ : తెలంగాణలోని పలు క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులు తమ దరఖాస్తును https://tgss.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో సమర్పించాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు స్పోర్ట్స్ స్కూల్‌లో సీటు సాధిస్తే క్రీడా రంగాన్ని శాసించేలా ఎదుగుతారనేది క్రీడా పాఠశాల లక్ష్యం. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలు ఎలా చేసుకోవాలి. ఎప్పుడు జరుగుతాయి, ఎలాంటి టెస్టులు ఉంటాయో.. తదితర విషయాలపై సాక్షి కథనం..
ఎంపిక విధానం..
రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను తెలంగాణ జిల్లాస్థాయిలో స్పోర్ట్స్ స్కూల్ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక సామర్థ్యంతో పాటు పలు టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ప్రతిభ కనబర్చి ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి ప్రవేశం ఉంటుంది. రాష్ట్రంలో నాలుగు స్కూళ్లు ఉండగా హనుమకొండలోని పాఠశాలలో 40 బాలికలు, 40 బాలురు మిగితా స్కూళ్లలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం ఉంటుంది.
మండలస్థాయి పోటీలకు..
మండల స్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎంతో పాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు 3వ తరగతి పాస్ సర్టిఫికెట్లతో మండలస్థాయి పోటీలకు హాజరు కావాలి.
ఎంపికలు..
ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రంల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.
జిల్లా స్థాయిలో ఎంపికలు..
ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీలోపు జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.
రాష్ట్రస్థాయిలో..
ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాకీంపేట స్పోర్ట్స్ న్కూల్‌లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. జూన్ రెండో వారంలో ప్రవేశాలు కల్పిస్తారు.
మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. 2017, సెప్టెంబర్ 1నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య పుట్టిన విద్యార్థులు అర్హులు. దొడ్డి కాళ్లు, ప్లాట్‌ఫీట్, వెన్నెముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, బౌ లెగ్స్ ఉన్న వారు. ఎక్కడైనా ఎముకలు విరిగిన వారు అనర్హులు.
ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6, 10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్ త్రో (కిలో బరువు), వర్టికల్ జంప్, ప్లెక్సిబిలీటీ టెస్ట్ (ముందుకు వంగి భూమిని తాకడం), మెడికల్ టెస్ట్.
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండలో పాఠశాలలు
ఒక్కో స్కూల్‌లో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం
అర్హులు వినియోగించుకోవాలి
క్రీడాకారులుగా ఎదగాలనే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఎంఈఓలను సంప్రదించాలి. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో చదివి అంతర్జాతీయ స్థాయితో పాటు ఒలింపిక్స్ వంటి ఈవెంట్‌లో పాల్గొని సత్తాచాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్‌లో ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ లభిస్తుంది. అర్హులైన చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రఘు, డీవైఎస్‌ఓ, జయశంకర్ భూపాలపల్లి


