స్నేహనగర్‌లో వింత చోరీ | - | Sakshi
Sakshi News home page

స్నేహనగర్‌లో వింత చోరీ

Mar 12 2026 7:49 AM | Updated on Mar 12 2026 7:49 AM

హన్మకొండ: హనుమకొండ స్నేహనగర్‌లో వింత చోరీ జరుగుతోంది. దండెంపై ఆరేసిన, ఉతకడానికి ఇంటి ఆవరణలో ఉంచిన మహిళల లోదుస్తులు, డ్రెస్సులు ఎత్తుకెళ్లి తిరిగి వారం పది రోజుల తర్వాత అదే ఇంటి వద్ద వదిలేస్తుండడంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. మహిళ దుస్తులు ధరించి మాస్క్‌తో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఈ వింత చోరీకి పాల్పడుతున్నాడని వారు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ చోరీకి పాల్పడుతున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైందని వివరించారు. దుస్తులు ఎత్తుకెళ్తుండడం, తిరిగి వదలి వెళ్తుండడంతో రాత్రి వేళలో మూత్రవిసర్జన, ఇతర కాలకృత్యాలకు రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారు. భారీ చోరీ కోసం కవ్విస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వాహనాల బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారని వారు తెలిపారు. ఈ మేరకు బుధవారం సుబేదారి పీఎస్‌లో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ రణధీర్‌కు స్నేహనగర్‌ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కండేరావు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డి.తిరుపతి రెడ్డి, బాధ్యులు ఫిర్యాదు చేశారు.

దుస్తులు ఎత్తుకెళ్లి వారం తర్వాత

వదిలేసిన దొంగలు

మాయమవుతున్న వాహనాల బ్యాటరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement