వినతులు సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వినతులు సత్వరమే పరిష్కరించండి

Mar 11 2026 8:58 AM | Updated on Mar 11 2026 8:58 AM

వినతులు సత్వరమే పరిష్కరించండి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 200 ఆర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

పరిష్కార మార్గం చూపండి:

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు 113 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 46, జీడబ్ల్యూఎంసీకి 21, ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంధ్యారాణి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్‌ పీడీ శ్రీవాణితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, మామునూరును మండలకేంద్రం చేయాలని మామునూరు మండల సాధన కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఖైదీగా శిక్ష అనుభవిస్తూ తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, ఆర్థిక సాయం అందించాలని కాశిబుగ్గకు చెందిన మనుపాటి సారమ్మ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement