వరంగల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వికారాబాద్‌లోని హరిత వ్యాలీలో నిర్వహించారు. ఈశిక్షణ ముగింపు కార్యక్రమానికి వచ్చిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ కుటుంబ సమేతంగా కలిశారు.
పార్ట్‌టైం లెక్చరర్ల నియామక దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2025–2026 విద్యాసంవత్సరంలో మిగిలిన కాలానికి వివిధ విభాగాల్లో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 4వ తేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు పొడిగిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆస క్తిగల అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వవిధ విభాగాల్లో కలిపి సుమారు 500వరకు దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంపుదలతో కొంతమేర పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 99 మంది పార్ట్‌టైం లెక్చరర్లను నియమించనున్నారు.


