డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

Mar 11 2026 9:20 AM | Updated on Mar 11 2026 9:20 AM

చదువుతోనే గుర్తింపు

వరంగల్‌ క్రైం: విద్యార్థులు ఉన్నత అశయాలతో చదువులో రాణించి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నార్కోటిక్స్‌ ఎస్పీ గిరిధర్‌ సూచించారు. మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పోలీసులు జక్రియ ఫంక్షన్‌ హాల్‌లో, సుబేదారి పోలీసులు మాస్టర్‌ జీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌ మహమ్మారిని కలిసి కట్టుగా తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు విలువైన జీవితాలను డ్రగ్స్‌ నాశనం చేస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ హనుమకొండ ఏసీపీ నరసింహరావు, హనుమకొండ ఎంఈఓ నెహ్రూ నాయక్‌, ఎంఈఓ హనుమకొండ, 10 డివిజన్‌ కార్పొరేట్‌ తోట వెంకటేశ్వర్లు, కేయూ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

విద్యారణ్యపురి: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్‌కు నార్కొటిక్‌ విభాగం ఎస్పీ గిరిధర్‌ అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ అండ్‌పీజీ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన ఆవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందులో ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బి.చంద్రమౌళి, ఎస్సైలు ఎస్‌.వెంకన్న, డీవీ ఫణి, రంజిత్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు కవిత, రామరత్నమాల, వి.మమత, బి.సువర్ణ విద్యార్థులు పాల్గొన్నారు.

హసన్‌పర్తి: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలంగాణ ఎన్‌ఏబీ ఎస్పీ గిరిధర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని శుభం గార్డెన్‌లో ఈగల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌ వ్యతిరేక, మహిళా రక్షణ’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గిరిధర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్షక్రమంలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్సైలు నవీన్‌, కళ్యాణ్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజ

నిర్మాణమే లక్ష్యం

కాజీపేట అర్బన్‌: డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల సదస్సులో భాగంగా మడికొండ పీఎస్‌ పరిధిలో టీజీన్యాబ్‌ సౌజన్యంతో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ పాల్గొని మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఉజ్వల భవిష్యత్‌ను అంధకారం చేసుకోకుడదని తెలిపారు. డ్రగ్స్‌ నివారణకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మడికొండ ఇన్స్‌పెక్టర్‌ పుల్యాల కిషన్‌, ఎకై ్సజ్‌ సీఐ చంద్రమోహన్‌, కార్పొరేటర్‌ ఆవాల రాధికరెడ్డి, మహిళా ప్రాంగణం అధికారి జయశ్రీ పాల్గొన్నారు.

ఆటో ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌ క్రైం/కాజీపేట : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సిటీ ఆర్మ్‌డ్‌ విభాగంలో సిటీ గార్డ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకటరెడ్డి (45) మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం కాజీపేట ఫాతిమా జంక్షన్‌ వద్ద వెంకట రెడ్డి తన బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకట్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కాజీపేట సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. వెంకట్‌రెడ్డి మృతి చెందడంతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement