వరంగల్ : మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గించారని ఆరోపిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. కాగా, మిర్చి కొనుగోళ్ల విషయంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ అడ్తి వ్యాపారులు జెండా పాటలో పాల్గొనలేదు. దాదాపు మూడు గంటల అనంతరం జరిగిన వేలంలో 341రకం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.21వేలు ఖరారైంది. దీంతో ఈరకం మిర్చి విక్రయానికి తీసుకొచ్చిన పలువురు రైతులు శనివారం క్వింటాల్‌కు రూ.22,300 ధర పలికితే సోమవారం రూ.1,300 తగ్గించారంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా ఏనుమాముల పోలీస్ ఇన్‌స్పెక్టర్ సురేశ్, సిబ్బంది గేట్ మూసి వేసి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం ఘటనాస్థలికి చేరుకుని ధర తగ్గించలేదని చెప్పారు. ఖమ్మం మార్కెట్‌లో 341 రకం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.20,500 పలికిందని రైతులకు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ప్రకారం ధరలు నిర్ణయమవుతాయన్నారు.
ధర తగ్గించారంటూ మార్కెట్‌లో ధర్నా
ఆఫీస్‌లోకి దూసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు


