కాజీపేట అర్బన్ : ‘ఆకలవుతోంది భోజనం పెట్టు బిడ్డా’ అని అడిగినందుకు ఓ ప్రబుద్ధుడు తన తల్లి పట్ల కర్కషంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ ఘటన మడికొండలో చోటు చేసుకుంది. మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ కథనం ప్రకారం.. మడికొండకు చెందిన వస్కుల శాంత రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆమె కు ఐదుగురు కుమారులు ఉండగా వారి వద్ద ఉంటోది. ఈ క్రమంలో శుక్రవారం ఆకలవుతోంది భో జనం పెట్టు బిడ్డా అని మూడో కుమారుడు రా మును కోరింది. అంతే దీనికి ఒక్కసారిగా కోపోద్రెకుడైన రాము.. తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అ నంతరం రాము భార్య సుమలత, నాలుగో కుమారుడు భార్య కల్పన కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టా డు. కుమారుడు బండతో కొట్టగా కింద పడింది. ఈ ఘటనలో తల పగిలిపోడంతోపాటు చేయి విరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మరో కుమారుడు శంకర్ వెంటనే ఘటనా స్థలికి చేరకుని శాంతను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. నడవలేని స్ధితిలో ఉన్న బాధితురాలు శాంత డయల్ 100కు కాల్ చేసి విషయం తెలిపింది. దీంతో స్వయంగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి విచారణ చేపట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ కాపీని కాపీని శాంతకు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వృద్ధులను దూషించిన, ఎలాంటి ఇబ్బందులు కలగజేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిపై కుమారుడి దాడి
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి వద్దే ఎఫ్‌ఐర్ నమోదు


