వరంగల్: రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేస్తే చోరీ చేసి తీసుకొచ్చిన బస్తాలు కొనుగోలు చేశారంటూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని అడ్తి వ్యా పారులు సోమవారం వరంగల్ ఏనుమాముల మా ర్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశా రు. సుమారు మూడు గంటల పాటు క్రయ, విక్రయాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు ఏటా వరంగల్‌కు చెందిన సూర్యతేజ ఎంటర్‌ప్రైజెస్‌లో పంటలు విక్రయిస్తుంటాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మూడు నాలుగు సార్లు మిర్చి తీసుకొచ్చి అడ్తిదారుడికి అదే గ్రామానికి చెందిన నలుగురు రైతులతో కలిసి విక్రయించాడు. మూడు రోజుల క్రితం భూపాలపల్లి ప్రాంతంలో మిర్చి బస్తాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై సూర్యతేజ ఎంటర్‌ప్రైజెస్‌కు విక్రయించే రైతు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని విచా రించగా తాను చోరీ చేసిన మిర్చిని వరంగల్ అడ్తిదా రుడికి విక్రయించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అడ్తిదారుడికి ఫోన్ చేసి దొంగ మిర్చిని తీసుకొ స్తే మీరు కొనుగోలు చేసినట్లు తెలిసింది.. పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పగా తాను వేరో చోట ఉన్నాయని, తర్వాత వస్తానని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు అడ్తిదారుడి వద్దకే వెళ్లి నిందితుడి తీసుకెళ్లి చూపించగా ఇతనే అమ్మాడని చెప్పాడు. దీంతో వివరాలు తీసుకుని పోలీసుస్టేషన్‌కు రావాలని చె ప్పగా అడ్తిదారుడు వెళ్లాడు. రోజంతా కూర్చుబెట్టి రాత్రికి ఇంటికి పంపించి ఉదయం రావాలని హు కుం జారీ చేశారు. ఈవిషయంపై ఆదివారం చాంబర్‌లో వ్యాపారులు సమావేశమై పోలీసుల వైఖరికి నిరసనగా కొనుగోళ్లు బంద్ చేయాలని నిర్ణయించి సోమవారం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. ఈవిషయం తెలిసిన వెంటనే మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ సత్యశారద, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు.. చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో మాట్లాడి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలో చాంబర్ ప్రతినిధులు కటకం పెంటయ్య, వేద ప్రకాశ్, మొగిళి చంద్రమౌళి, అల్లె సంపత్, ఎన్‌రెడ్డి లింగా రెడ్డి, చాగర్ల శ్రీనివాస్,రాజేశ్, డి.కరాణి, కాటన్ సెక్ష న్ ప్రెసిడెంట్ చింతలపల్లి వీరారావు పాల్గొన్నారు.
పోలీసుల వైఖరి బాధ కలిగించింది..
‘అడ్తి వ్యాపారిని రోజంతా పోలీసుస్టేషన్‌లో ఉంచడంపై నేను భూపాలపల్లి క్రైం ఎస్సై రమేశ్‌కు కాల్ చేసి తాను చాంబర్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాన ని చెప్పగా చాంబర్ అని చెప్పొద్దు.. పేరు మాత్రమే చెప్పాలి’ అని అనడం బాధించిందని చాంబర్ అఽ ద్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. ఆరోపణలు వస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అడిగే హక్కు తమకు ఉంటుందని ఎస్సై అనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇలా వేధింపులకు గురిచేస్తే పంటలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, ఆధార్‌కార్డు తీ సుకురావాలని అంటే రైతులు ఇబ్బందులు పడతారన్నారు. అధికారుల హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభించామన్నారు.
మూడు గంటలపాటు నిలిచిన
క్రయ, విక్రయాలు
మార్కెట్ అధికారుల హామీతో నిరసన విరమణ


