త్వరలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

త్వరలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

Mar 12 2026 7:49 AM | Updated on Mar 12 2026 7:49 AM

కాజీపేట రూరల్‌: అమృత్‌ భారత్‌ పథకం కింద రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ రూ.716 కోట్లతో కాజీపేటలోని చేపట్టిన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి సిద్ధం ఉందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, నాయకులు డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, కాచం గురుప్రసాద్‌, కందగట్ల సత్యనారాయణ, మేకల శ్రావణ్‌ యాదవ్‌, మధు, మేఘనాథ్‌, కార్పొరేటర్లు గుజ్జుల వసంత, బైరి శ్రావణ్‌, రావుల కిషన్‌ పాల్గొన్నారు.

నానో టెక్నాలజీపై సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో బుధవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నానో టెక్నాలజీపై సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించారు. నా నోకణాలు , గ్రీన్‌నానో టెక్నాలజీ –సంశ్లేషణ విశ్లేషణ వినియోగాలు అనే అంశంపై ఈ సర్టిఫికెట్‌ కో ర్సు ద్వారా విద్యార్థులకు గ్రీన్‌ టెక్నాలజీ ప్రాథమిక సూత్రాలు, బయోటెక్నాలజీలో వినియోగాల గురించి అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఉందని ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి తెలిపారు. సమావేశాని3కి వరంగల్‌ నిట్‌ బయోటెక్నాలజీ విబాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పెరుగు శ్యాం ముఖ్యఅతిథిగా పాల్గొని నానోటెక్నాలజీలో వస్తున్న మార్పులు, సూక్ష్మజీవ శాస్త్రంలో ప్రాముఖ్యతపై వివరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ జిసుహాసిని, మైక్రోబయాలజీ విభాగం ఆర్డినైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ రేణుక, డాక్టర్‌ ఆదిత్య పాల్గొని మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement