ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
వరంగల్ లీగల్: ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబ, బి.అపర్ణ సూచించారు. శనివారం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)ఆధ్వర్యంలో సుబేదారిలోని అమృత వెల్‌నెస్ సెంటర్ సహకారంతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. క్యాంపును న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈశిబిరంలో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నిపుణులు ఆరోగ్య పరిరక్షణపై సూచనలందించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, జి.రామలింగం, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులి సత్యనారాయణ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


