అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్‌ గుర్తుకురాలేదా? | - | Sakshi
Sakshi News home page

అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్‌ గుర్తుకురాలేదా?

Mar 1 2026 7:17 AM | Updated on Mar 1 2026 7:17 AM

అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్‌ గుర్తుకురాలేదా?

అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్‌ గుర్తుకురాలేదా?

అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్‌ గుర్తుకురాలేదా?

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌కు కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావును వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం కాజీపేట పర్యటనపై ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించారన్నారు. వరంగల్‌ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, పర్యటనల పేరుతో పదేళ్లు పబ్బం గడిపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీలంతా కాజీపేటకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కాజీపేట పర్యటన.. స్వామి కార్యం, స్వకార్యంగా ఉందని హేళన చేశారు.

సీఎం రేవంత్‌ను కలిసిన నాయిని

సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్‌ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఇటీవల కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ సుజిత్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. సొంతగడ్డపై మమకారంతో వైద్య రంగానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సుజిత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యారాణి, విష్ణురెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement