షార్ట్‌ సర్క్యూట్‌ హోమ్‌నీడ్స్‌ షాపు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌ హోమ్‌నీడ్స్‌ షాపు దగ్ధం

Mar 8 2026 7:13 AM | Updated on Mar 8 2026 7:13 AM

రూ. 50 లక్షల విలువైన ఆస్తి నష్టం

వరంగల్‌ చౌరస్తా : షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ హోమ్‌నీడ్స్‌ షాపు దగ్ధమైంది.ఈ ఘటన వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డులో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. దత్తాత్రేయ హోమ్‌ నీడ్స్‌ షాపు యజమాని సతీశ్‌ శనివారం ఉదయం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మొయిన్‌ రోడ్డు వద్ద చేలరేగిన మంటలతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. మొదటి ఫ్లోర్‌లోని హోమ్‌ నీడ్స్‌ మొత్తం మంటల్లో కాలిపోయింది. అనంతరం మంటలు మొదటి అంతస్తులో ఉన్న డెంటల్‌ షాపునకు ఎగబాకే క్రమంలో నాలుగు ఫైర్‌ ఇంజినీర్లు చేరుకుని ఆర్పాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాని సతీశ్‌ లబోదిబోమన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ రెడ్డి, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నవీన్‌ , హనుమకొండ ఫైర్‌ ఆఫీసర్‌ దిలీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement