కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆర్‌వీఎన్‌ఎల్ సికింద్రాబాద్ డీజీఎం శర్మ, ఆర్‌వీఎన్‌ఎల్ ఆర్‌ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ నుంచి వికాస్‌రెడ్డి.. ఆర్‌ఎంయూ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ పనులు తనిఖీ చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పవర్‌మెక్‌ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌కు సూచించినట్లు అధికారులు తెలిపారు.
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా పొదనూర్–బరోని మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
మార్చి 16, 23వ తేదీల్లో పొదనూర్–బరోని (06021) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా మార్చి 16,19వ తేదీల్లో బరోని–పొదనూర్ (06022) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు తినుప్పుర్, ఈరోడ్, సేలం, జోలర్‌పెట్టాయ్, కట్‌పడి, పె రంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, రామగుండం, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లా ర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, బెతూల్, ఇటార్సీ, జబల్‌పూర్, సంత, మానిక్‌పూర్, ప్రయాగ్‌రా జ్, చౌకీ, చూనర్, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, బాక్సర్, ఆరా, దానాపూర్, పాటలీ పుత్ర, హాజిపూర్, షాపూర్ పాటూరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.


