కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రూబిజెస్ట్– 26 శనివారం రాత్రి ముగిసింది. ఫెస్ట్‌లో భాగంగా వివిధ ఈవెంట్‌లలో ప్రాజెక్టు ఎక్స్‌పో, టెక్నికల్ క్విజ్, కోడింగ్, పోస్టర్ల ప్రజెంటేషన్స్, లాజికల్ ఫజిల్స్ వంటిపలు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. అలాగే, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహించారు. ఫ్యాషన్ షోలు, మోడలింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా సింగర్లు పవన్‌కల్యాణ్, అనన్యభాస్కర్ పాటలు పాడారు. ఈవెంట్ల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు, స్టూడెంట్స్ అకడమిక్ కోఆర్డినేటర్ అర్చనను సన్మానించారు. కన్వీనర్ సురేందర్ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


