గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 5 2026 8:54 AM | Updated on Mar 5 2026 8:54 AM

– 8లోu

7 కేంద్రాల్లో నిర్వహణ..

ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), షిల్లాంగ్‌(మేఘాలయ).

ఎవరు అర్హులంటే..

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్‌, సైన్స్‌ క్లబ్‌లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు.

తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

ఈ నెల 31 వరకు గడువు..

విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్‌ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు.

అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి.

– మహబూబాబాద్‌ అర్బన్‌

అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్‌ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది.

అన్నీ ఉచితంగానే..

ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్‌ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో తొమ్మిదో

తరగతి చదువుతున్న మొత్తం

విద్యార్థులు

48,941

ఉన్నారు.

విద్యార్థులు వినియోగించుకోవాలి..

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్‌. డీఈఓ, మహబూబాబాద్‌

జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు

శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్‌

ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు

ఎంపికైతే ప్రత్యేక శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement