టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ
ఎస్‌ఈ మధుసూదన్ రావు
హన్మకొండ: విద్యుత్ శాఖకు జూనియర్ లైన్‌మెన్లు, లైన్‌మెన్‌లే వెన్నెముక అని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) పి.మధుసూదన్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్‌లో లైన్‌మెన్ దివస్‌ను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగ అమరుల స్తూపం వద్ద ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు, డీఈలు ఎ.విజేందర్‌రెడ్డి, జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అధికారులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్లు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్, కె.నవీన్ కుమార్, సహాయ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


