సహజ హోలీ..
రసాయన రంగుల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు
● చర్మానికి రంగులు పట్టుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఆవాల నూనె, జెల్లి రాసుకోవాలి.
● అద్దాలు పెట్టుకుంటే రంగునీళ్లు కళ్లలో పడకుండా ఉంటాయి.
● హోలీ ఆడిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేనిపక్షంలో చేతి గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
మోదుగు పూల రంగులతోనే
పండుగ జరుపుకోవాలి
● రసాయనాలతో ముప్పు.. ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు
నేడు హోలీ పర్వదినం
సహజ రంగులైతే మేలు..
సహజ సిద్ధ రంగులు వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. దానిమ్మ, టమాటాలతో ఎరుపు రంగు, మోదుగుపూలు, క్యారెట్‌తో ఆరెంజ్ రంగు, బీట్‌రూట్‌తో ఊదారంగు, ఆకు కూరలతో ఆకుపచ్చ రంగు, పసుపు కొమ్ములతో పసుపు రంగు ఇలా సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి హాని జరగదు.
మోదుగుపూలతో రంగుల తయారీ ఇలా..
హోలీకి ఒక రోజు ముందు మోదుగు పూలు తీసుకొచ్చి వే డి నీటిలో ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత మరుసటి రోజు వరకు నీటిలోనే నానబెడతారు. తెల్లవారుజామున నానబెట్టిన మోదుగుపూలను దంచి సీసాలో వడబోస్తారు. అనంతరం ఆ రంగు నీటితో హోలీ ఆడుతారు.
రసాయన రంగులతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రకృతి ప్రసాదించే మో దుగు పూలు ఆరోగ్యరీత్యా పలు సుగుణాలు కలిగి ఉన్నాయి. మా చిన్నతనంలోస్నేహితులతో కలిసి ఒక రోజు ముందే మోదుగు పూలు తెచ్చి నానబెట్టి ఉడికించిన తర్వాత చేసిన కాషాయవర్ణపు రంగులతో హోలీ ఆడేవాళ్లం. సహజ సిద్ధ రంగులు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు .
– అనంతగిరి సురేశ్, చిన్నగూడూరు


