సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌ను అమలు చేయండి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మట్టెవాడ వాటర్ ట్యాంకులో ఆదివారం మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాలో ఆ టంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి వాల్వ్‌లు, బోర్లకు మరమ్మతులు చేయాలని కోరారు. డీఈలు సతీశ్, మొజామిల్, రవీందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు.


