ఉన్నత విద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

విద్యారణ్యపురి: ఉన్నతవిద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని సామాజికవేత్త, సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అకడమిక్‌ ప్రీడమ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ అటానమీ అండ్‌ డెమొక్రాటిక్‌ రెసిలియన్స్‌’ అంశంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో శాసీ్త్రయ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు. పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలతో అకడమిక్‌ పరంగా బోధన చేసే పరిస్థితులు అధ్యాపకుల చేతుల్లో లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఉన్నత విద్యారంగానికి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ హరిజందర్‌సింగ్‌ మాట్లాడుతూ డిజిటల్‌ మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఓయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్యం నాణ్యతగా లభిస్తే ప్రైవేట్‌రంగాలు అభివృద్ధి చెందవని పేర్కొన్నారు. జాతీయ సదస్సు ఈనెల 7న ముగియనుంది. సదస్సుకు కేడీసీ ప్రిన్సిపాల్‌ ఆచార్య గుర్రం శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఫాక్యల్టీ ఫోరం బాధ్యులు మధుసూదన్‌రెడ్డి, అరుణకుమార్‌ మాట్లాడారు.

సామాజికవేత్త, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌

కేడీసీలో జాతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement