విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

Mar 1 2026 7:17 AM | Updated on Mar 1 2026 7:17 AM

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూ పంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని తదితరల సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. ఈమేరకు కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ఆర్‌సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును క్షుణంగా చదివి పరిశీలించాలని, విద్యార్థుల పేర్లను గోప్యంగా ఉంచి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆర్‌సీఓలను ఆదేశించారు.సమావేశంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎస్‌డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్‌, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్‌, టెమ్రిస్‌ ఆర్‌ఎల్‌సీ డాక్టర్‌ జంగా సతీశ్‌, ఆర్‌సీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement