వైభవోపేతంగా ఫాతిమామాత
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమామాత స్వరూపంతో మహా రథ ప్రదక్షిణ ఊరేగింపు(ర్యాలీ) గురువారం వైభవోపేతంగా కొనసాగింది. కెథిడ్రల్ చర్చి ప్రాంగణంలో ఓరుగల్లు పీఠం పాలనాధికారి ఫాదర్ రెవరెండ్ డి.విజయపాల్ రెడ్డి ప్రత్యేక ప్రార్థన చేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం ఫాదర్లు, మఠకన్యలు, విశ్వాసులు, భక్తజనం మధ్య ఊరేగింపు ఫాతిమానగర్ మెయిన్ రోడ్ మీదుగా శౌరి నగర్, దర్గా పురవీధుల గుండా తిరిగి ఫాతిమా కెథిడ్రల్ చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం భక్తులు, విశ్వాసులు కొవ్వొత్తులతో దివ్యప్రసాద ప్రదక్షిణ చేశారు. అంతకు ముందు ఫాదర్ డి.విజయపాల్‌రెడ్డి దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడుతూ మానవాళికి మరియతల్లి ప్రార్థన సహాయం శక్తివంతమైందన్నారు. ఫాదర్లు మర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసెఫ్, జోసెఫ్, జి.అనుకిరణ్, ఎం.నవీన్, విద్యాసాగర్, 49వ డివిజన్ కార్పొరేటర్ మానసరాంప్రసాద్, కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ పి.వెంకన్న, ఎన్పీడీసీఎల్ ఏడీఈ పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభించిన ఓరుగల్లు పీఠం పాలనాధికారి విజయ్‌పాల్‌రెడ్డి


