ఎఫ్‌ఎల్‌ఎన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి

Mar 13 2026 9:02 AM | Updated on Mar 13 2026 9:02 AM

ఎఫ్‌ఎల్‌ఎన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి

వరంగల్‌ ఏఎంఓ ఉండ్రాతి సుజన్‌ తేజ

కాళోజీ సెంటర్‌: ప్రాథమిక విద్యార్థుల్లో ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో విద్యావ్యస్థలో అత్యంత కీలకమైన అంశమని వరంగల్‌ అకడమిక్‌ మానిట రింగ్‌ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్‌ తేజ అ న్నారు. హనుమకొండలోని డైట్‌ కళాశాలలో గురువారం రెండో రోజు జరిగిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధిస్తే వారి భవిష్యత్‌ విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు. నిపుణ్‌ భారత్‌ మిషన్‌ లక్ష్యాలను సాధించడానికి ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి సులభంగా చదివేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పద్ధతులను ఉపయోగించి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని అంచనా వేయనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ ప్లేవే మెథడ్‌, చైల్డ్‌ సెంటర్‌ టీచింగ్‌ పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ రిస్సోర్స్‌ పర్సన్స్‌ గంగాధర్‌, పద్మజ, సౌజన్య, నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement