మోడల్‌ రాకెట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ రాకెట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

మోడల్‌ రాకెట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

మోడల్‌ రాకెట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

నయీంనగర్‌: భద్రకాళి బండ్‌ వద్ద మోడల్‌ రాకెట్‌ ట్రయల్‌ రన్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్‌ రాకెట్‌ లాంచింగ్‌ ట్రయల్‌ రన్‌ కోసం ఏర్పాట్లు చేయగా, భద్రకాళి చెరువులోని ఐలాండ్‌ వద్ద నమూనా రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. మోడల్‌ రాకెట్‌ రూపకర్త శశాంక్‌ భూపతి ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈసందర్భంగా వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ అంజన్‌ కుమార్‌, ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఫౌండర్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ ఎన్‌.రఘునందన్‌కుమార్‌, ‘కుడా’ సీపీఓ అజిత్‌ రెడ్డి, ఈఈ భీమ్‌రావు, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు సమక్షంలో రాకెట్‌ లాంచింగ్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్‌ నుంచి రుద్రమ–1 మోడల్‌ రాకెట్‌ ప్రయోగించనున్నారు. ఈ ప్రమోగంతో చారిత్రక వరంగల్‌ నగరం సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. శనివారం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:00 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే సెమినార్‌లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వక్తలు ప్రసంగిస్తారు. సెమినార్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement