హైదరాబాద్‌ తరలిన రైల్వే జేఏసీ బృందం | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ తరలిన రైల్వే జేఏసీ బృందం

Mar 11 2026 9:20 AM | Updated on Mar 11 2026 9:20 AM

హైదరాబాద్‌ తరలిన రైల్వే జేఏసీ బృందం

కాజీపేట రూరల్‌: ఈ నెల 15న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్‌ వద్ద నిర్వహించనున్న నిరసనలో పాల్గొనాలని ఆహ్వానించేందుకు రైల్వే జేఏసీ హైదరాబాద్‌ తరలింది. కాజీపేటను డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాపై మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు మంగళవారం రైల్వే జేఏసీ కన్వీనర్‌ దేవులపల్లి రాఘవేందర్‌ తెలిపారు. మంగళవారం కరపత్రాలు తీసుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును, అరుణోదయ సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కను, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ సెక్రటరి ఎం.రాఘవయ్యను, సంఘ్‌ ఏజీఎస్‌ భరణి భానుప్రసాద్‌, ఎజీఎస్‌ రుద్రారెడ్డి, సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్రటరీ ప్రభురాజ్‌, ప్రెసిడెంట్‌ కొత్త మురళీకృష్ణ, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాస్‌, ఏజీఎస్‌ మురళీధర్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్రటరీ పి.రవీందర్‌, ప్రెసిడెంట్‌ ఖాజాపాషా, ట్రెజరర్‌ నర్సింహారెడ్డిని కలిసి కరపత్రాలు అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ చైర్మన్‌ కోండ్ర నర్సింగరావు, బృందం పాక వేదప్రకాశ్‌, వస్కుల రవీందర్‌, బి.మాధవరావు, వాయిల్ల తిరుపతి, పి.రమేశ్‌, కె.సాయిరాజ్‌, అనుముల శ్రీ నివాస్‌, రవీందర్‌, ఎం.రాజయ్య, భూ నిర్వాసితులు ఇలాసాగరం ప్రదీప్‌, కాయిత కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement