వరంగల్ క్రైం : ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పో లీస్ అధికారులను శని వారం ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. విరమణ పొందిన వారిలో సబ్ ఇన్‌స్పెక్టర్లు సిద్ధయ్య, సాంబారెడ్డి కనకచంద్రం, సయ్యద్ చాంద్ పాషా, లింగారెడ్డి, రాజు, ఆర్‌ఎస్సై మహమూద్, ఏఆర్‌ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, రాములు ఉన్నారు. ఈ సందర్భగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖకు సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారులు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. విరమణ అనంతరం ఆరో గ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, ఆర్‌ఎస్సై శ్రవణ్ కుమార్, విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ ప్రీత్ సింగ్


