● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్/కాజీపేట రూరల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 48, 49వ డివిజన్ల పరిధిలో రూ.9.37 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్‌పాయ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో నిట్ నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈరహదారికి సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షలతో అంతర్గత రోడ్లు, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా, కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సర్తాజ్‌బేగం, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్‌రెడ్డి, మట్టాడ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
02హెచ్‌ఎంకెడి180:


