బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
కాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని వరంగల్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతనకార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్‌ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్‌బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు.


