ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలి

Mar 11 2026 9:20 AM | Updated on Mar 11 2026 9:20 AM

వీసీ డాక్టర్‌ మహేష్‌

హసన్‌పర్తి : విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని ఎస్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ మహేష్‌ పేర్కొన్నారు. ఎస్సార్‌ యూనివర్సిటీలో రెండ్రోజుల పాటు నిర్వహించిన నేషనల్‌ ఐపీ యాత్ర–2026 మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి వీసీ డాక్టర్‌ మహేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్‌ యుగంలో ఆవిష్కరణలు, స్టార్టప్స్‌, సృజనాత్మక ఆలోచనలను రక్షించుకోవడానికి మేథో సంపత్తి హక్కులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు తమ ఆలోచనలను పేటెంట్లు, కాపీ రైట్స్‌, ట్రేడ్‌ మార్క్‌ల ద్వారా రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ ప్రతినిధి డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ఇన్నోవేషన్‌ డీన్‌ బి.గిరిరాజన్‌, అసోసియేట్‌ డీన్‌ ఎ.చంద్రాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement