హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో విద్యుత్ అమైండ్‌మెంట్ బిల్లు ప్రతిపాదనలు ప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈసందర్భంగా టీఎస్‌ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా వినియోగదారులపై భారం పడుతుందన్నారు. ప్రయివేటీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం–1104 ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి రమణ, తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, విద్యుత్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరాంనాయక్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ నీలారపు రాజేందర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కుమారస్వామి, ఆయా సంఘాల నాయకులు చిట్ల ఓదెలు, మచ్చిక బుచ్చయ్యగౌడ్, లక్ష్మణ్ నాయక్, ఉద్యోగులు పాల్గొన్నారు.


