ముందస్తు ఫ్లాట్ల బుకింగ్‌ పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ఫ్లాట్ల బుకింగ్‌ పేరుతో మోసం

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

రూ.81 లక్షలు వసూలు చేసిన నిందితుడి రిమాండ్‌

వరంగల్‌ క్రైం: ఫ్లాట్ల ముందస్తు బుకింగ్‌ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌ గుండ్లపోచంపల్లిలో 2018లో ఎస్‌వీబీ వైభవ్‌ పేరుతో ఏడు అంతస్తుల్లో 164 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని సోలిపేట ప్రభాకర్‌రెడ్డి, కోడూరు లక్ష్మి ఆశ చూపారు. హనుమకొండ ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ దగ్గర రూ.81 లక్షలు తీసుకొని మోసం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సోలిపేట ప్రభాకర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement