● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. అలాగే, జిల్లాలోని పలువురు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 222 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు :
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజలు ఇచ్చిన వినతులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 163 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి 67, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన దరఖాస్తులను కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, జిల్లా అధికారులున్నారు.


