హన్మకొండ : గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా కొనసాగిన శ్రీపాదరావు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేశారన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలు తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఆయన ప్రత్యేకత అన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, మాధవ రావు, సీజీఎంలు రవీంద్రనాఽథ్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్, శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు హేమంత్ కుమార్, వేణు బాబు, గిరిధర్, నాగ ప్రసాద్, కళాధర్ రెడ్డి, జయరాజ్, శ్రీనివాస రావు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


