అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Mar 8 2026 7:13 AM | Updated on Mar 8 2026 7:13 AM

వరంగల్‌: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్‌ కాశిబుగ్గ 20 డివిజన్‌ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు డివిజన్‌కు చెందిన క్యాతం రవీందర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా మంత్రి సురేఖ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాశిబుగ్గ జంక్షన్‌ నుంచి తిలక్‌ రోడ్డు కేవీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి మీ సాల ప్రకాశ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. నాయకులు నవీన్‌రాజ్‌, ఓని భాస్కర్‌, డి.రాజేశ్‌, సతీశ్‌, లావణ్య, రాజమణి, సంతోష్‌ పాల్గొన్నారు.

కనిపించని పార్టీ జిల్లా అధ్యక్షుడు..

తూర్పు నియోజవర్గంలోని 20వ డివిజన్‌లో నిర్వహించిన చేరికల సభలో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆయూబ్‌ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన రవీందర్‌ కాశిబుగ్గలోని పలు కూడళ్లలో ఏర్పాటు చసిన ఫ్లెక్సీల్లో సైతం డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేక పోవడంపై సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు స్థానికంగా ఉన్నా చేరికల సభకు ఆహ్వానించలేదని తెలిసింది. ఈవిషయంపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement