ఆరోగ్యం భద్రం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం భద్రం

Mar 11 2026 9:20 AM | Updated on Mar 11 2026 9:20 AM

పరీక్షల వేళ..

ఖిలా వరంగల్‌ : పదో తరగతి పరీక్షల సమయం ముంచుకొస్తోంది. త్వరలో ఒకదాని తర్వాత ఒక్కో పరీక్షలున్నాయి. ప్రతి విషయానికి విద్యార్థులు హైరానా పడుతుంటారు. తిండి సరిగా తినరు. సమయానికి నిద్ర పట్టదు.. మనసులో ర్యాంకులు, మార్కులు చక్కర్లు కొడుతుంటాయి. ఈ సమయంలో పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలు తినే ఆహార నియమాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. సమతుల్య ఆహారం అందిస్తూ మనసుకు ప్రశాంతత చేకూరే వాతావరణం కల్పిస్తే ఒత్తిడిని అధిగమిస్తారని నిపుణులు చెబుతున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులైతే పరీక్షల సమయంలో బరువు తగ్గిపోతున్నారు. సిలబస్‌ పూర్తికాకపోతే ఆహారంపై కూడా ధ్యాస తగ్గిపోతుంది. దీనికి తోడు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు బాగా చదవాలని పిల్లలపై ఒత్తిడి పెంచడంతో ఆకలి నుంచి దూరం చేస్తుంది. పరీక్షలకు ఎంత కష్టపడి సిద్ధం అవుతుంటారో.. అదేస్థాయిలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోని విద్యార్థుల్లో ఎక్కువగా చిరాకు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. రోజూ తీసుకునే ఆహారం కంటే పరీక్షల సమయంలో పదిశాతం అధికంగా మెదడుకు అవసరమని అధ్యయనంలో తేలింది.

సమయానికి భోజనం చేయాలి

పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజు సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం. కనీసం 15 నిమిషాల పాటు నడవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉంటారు.

సమయానికి నిద్ర తప్పనిసరి

విద్యార్థులకు సమతుల ఆహారం ఇవ్వాలి

ఈ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement