రామన్నపేట: హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్‌హాల్‌లో ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ (ఎన్‌ఐఆర్‌సీ) చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్ బ్రాంచ్‌కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్ మాట్లాడుతూ సీఏ మెంబర్స్, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్‌స్టిట్యూట్ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. సీఏ మెంబర్స్ కోసం సెమినార్స్, విద్యార్థులకు తరగతులు, రీడింగ్ రూం సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఏ సుధాటి వినీల్‌రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్, స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.భరత్‌రాజ్, ఎంసీ మెంబర్ సత్యనారాయణ, రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సీఏ మండవ సునీల్, రీజినల్ కౌన్సిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ దీపక్ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


