హన్మకొండ: 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బహిరంగా విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సి.హెచ్.శ్రీనివాస్ రావు పాల్గొంటారని తెలిపింది. ఆసక్తి గల విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని సంబంధిత అధికారులు కోరారు.
● సాదుతండాలో ఘటనలో
డోర్నకల్ : మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరో లు మండలం అందనాలపాడు జీపీ పరిధిలోని సాదుతండాలో చోటు చేసుకుంది. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ సురేశ్(23) డోర్నకల్ మండలం తొడేళ్లగూడెంలోని ఎస్‌కే ఆగ్రోస్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సురేశ్‌కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన సురేశ్ స్నేహితుడు ఆంగోత్ సాయి తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల సాయితోపాటు కొంతమంది సురేశ్‌ను మానసికంగా వేధించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయితో పాటు వారి కుటుంబ సభ్యుల వేధిపులతోనే సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో డోర్నకల్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మృతుడి తండ్రి శ్రీనుకు హామీ ఇచారు. అనంతరం మృతుడి కుటంబీకుల ఫిర్యాదు మేరకు ఆంగోత్ సాయి, నాగేశ్వర్‌రావు, ఆశా, అఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హాస్టల్‌లో మళ్లీ మంటలు
● విద్యార్థినుల పరుగులు..
● కిందపడి పలువురికి గాయాలు
● మరో హాస్టల్‌కు తరలింపు
హసన్‌పర్తి : 24 గంటలు గడవక ముందే ఆ హాస్టల్‌లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం రాత్రి భీమారం సమీపంలోని ఓ కళాశాల హాస్టల్‌లో చోటు చేసుకుంది. నగరంలోని భీమారం–పలువేల్పుల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఓ కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే భీమారంలోని గణేశ్ నగర్‌లో నిర్వహిస్తున్న హాస్టల్‌లో విద్యార్థినులకు వసతి కల్పించారు. ఆదివారం ఆ హాస్టల్‌లోని పై అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ సమయంలో విద్యార్థినులు కింది అంతస్తులో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ఘటనలో విద్యార్థినుల సామగ్రితో పాటు సర్టిఫికెట్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ అదే హాస్టల్‌లో మంటలు చెలరేగాయి. గ్లిజర్ పేలడంతో ఒకే సారి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురై పరుగులుదీశారు. ఈ సమయంలో కొంతమంది విద్యార్థినులు కింద పడి స్వ ల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా, అదే కళాశాల పేరుతో నిర్వహిస్తున్న మరో హాస్టల్‌లోకి విద్యార్థినులను తరలించారు.


