విద్యుత్‌ వినియోగం ౖపైపెకి.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వినియోగం ౖపైపెకి..

Mar 2 2026 8:57 AM | Updated on Mar 2 2026 8:57 AM

విద్య

విద్యుత్‌ వినియోగం ౖపైపెకి..

హన్మకొండ : శీతాకాలం ముగియడంతోనే విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్‌ చరిత్రలో అధిక స్థాయిలో నమోదవుతూ రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. మార్చితో వేసవి మొదలైంది. కాలం ఆరంభానికి ముందు నుంచి గరిష్ట స్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కావడం చూస్తే మండుటెండల వరకు మరిన్ని రికార్డులు నమోదవుతాయ ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతాకా లం ముగియడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో వినియోగదారులు ఫ్యాన్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఫలితంగా కరెంట్‌ వినియోగం పెరిగింది.

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం..

గతేడాది మార్చి 11న 5,816 మెగావాట్ల డిమాండ్‌ నమోదు కాగా ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిమాండ్‌గా ఉంది. ఈసారి 12 రోజుల ముందుగానే ఫిబ్రవరి 28న అత్యధికంగా 6,057 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. ఇదిలా ఉండగా మరునాడే ఈ నెల 1వ తేదీ (ఆదివారం)న టీజీ ఎన్పీడీసీఎల్‌ చరిత్రలోని గరిష్టంగా 6,267 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం, చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి గత రెండు నెలల నుంచి వేసవికి అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే వేసవిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకోవాని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ ఇంజనీర్లు, ఏడీఈలు, ఏఈలు వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు.

అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు..

అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ల స్థానంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, వీలుకాని చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదే విధంగా సబ్‌ స్టేషన్లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 35 నూతన 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు నిర్మించారు. అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 366 బిగించారు. 7,600 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. 33 కేవీ ఫీడర్లలో ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్లు వేశారు. లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు 392 కెపాసిటర్‌ బ్యాంక్‌లు అమర్చారు. వేసవి దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణ, వదులుగా ఉన్న లైన్లు సరి చేయడానికి అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

చలి తగ్గగానే ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌

ఆగకుండా తిరుగుతున్న ఫ్యాన్లు, ఏసీలు

ఎన్పీడీసీఎల్‌ చరిత్రలో రికార్డులు బ్రేక్‌

శనివారం 6,057, ఆదివారం 6,267 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌

విద్యుత్‌ డిమాండ్‌ వివరాలు(మెగావాట్లు)..

తేదీ 2026లో 2025లో 2024లో

ఫిబ్రవరి డిమాండ్‌ డిమాండ్‌ డిమాండ్‌

20 5,845 5,502 5,178

21 5,904 5,573 5,283

22 5,837 5,635 5,189

23 5,709 5,494 5,243

24 4,798 5,670 5,200

25 5,158 5,708 4,903

26 5,279 5,778 5,061

27 5,948 5,451 5,061

28 6,057 5,646 5,228

మార్చి1 6,267 5,709 5,174

విద్యుత్‌ వినియోగం ౖపైపెకి.. 1
1/1

విద్యుత్‌ వినియోగం ౖపైపెకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement