అమ్మవారి సేవలో కలెక్టర్‌ చాహత్‌ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవలో కలెక్టర్‌ చాహత్‌

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

అమ్మవ

అమ్మవారి సేవలో కలెక్టర్‌ చాహత్‌

మట్టిపాత్రలను వాడాలి : డీఈఓ

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఉదయం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ దర్శించుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ను ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్త బింగి సతీశ్‌ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ఆమె ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం తినిపించి అనంతరం ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని అమ్మవారి ని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆల య అర్చకులు కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రమేశ్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా హీరోయిన్‌ నభా నటేష్‌ అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

కాళోజీ సెంటర్‌: మట్టి పాత్రలు వాడి పర్యావరణహిత జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాల ని వరంగల్‌ డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మట్టిపాత్రల తయారీపై కార్యశాల (పాట్‌ మే కింగ్‌ వర్క్‌షాప్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టిపాత్రల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రాచీన కాలంలో మట్టితో తయారు చేసిన వస్తువులనే ఉపయోగించేవారని గుర్తుచేశారు. ముందుగా విద్యార్థులు మట్టి పాత్రల తయారీవిధానాన్ని చేసి చూపించారు. జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, ఏఎంఓ ఉండ్రాతి సుజన్‌ తేజ, పాఠశాల హెచ్‌ఎం అరుణ, ఉపాధ్యాయులు ప్రభాకర్‌, కిరణ్‌, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి సేవలో  కలెక్టర్‌ చాహత్‌1
1/1

అమ్మవారి సేవలో కలెక్టర్‌ చాహత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement