గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం

Mar 1 2026 7:17 AM | Updated on Mar 1 2026 7:17 AM

గంజాయ

గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుకుందామని వరంగ ల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం కాకతీయ మెడికల్‌ కళా శాలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగదారుడిని పట్టుకోవడంతో బాధ్యత అయిపోతుందని అనుకోవద్దని, గంజాయిని విక్రయించే వారిని గుర్తించి అరెస్ట్‌ చేయాలని పేర్కొన్నారు. అలాగే, పేకాటరాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా ఎంజీఎం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇసుక, రేషన్‌ అక్రమ రవాణాపై స్టేషన్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించా రు. డీసీపీలు అంకిత్‌ కుమార్‌, రాజమహేంద్ర నాయక్‌, కవిత, శుభంనాగ్‌తోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌గా

లక్ష్మీనారాయణ

కాళోజీ సెంటర్‌: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్‌ మందాల భాస్కర్‌, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్‌, విద్యార్థి జేఏసీ చైర్మన్‌ మాదాసి రాహుల్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్‌హక్‌ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్‌, పోతుల కొమ్మాలు, వంగేటి రాజమౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్‌, వంగేటి ప్రభాకర్‌ నియమితులయ్యారు.

గంజాయి నుంచి  యువతను కాపాడుకుందాం
1
1/1

గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement