పాట ఓ చైతన్య కెరటం | - | Sakshi
Sakshi News home page

పాట ఓ చైతన్య కెరటం

Mar 1 2026 7:17 AM | Updated on Mar 1 2026 7:17 AM

పాట ఓ చైతన్య కెరటం

పాట ఓ చైతన్య కెరటం

పాట ఓ చైతన్య కెరటం

భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలి

సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్‌

తెలుగు సినిమా గేయ రచనపై సదస్సు

‘గేయ పరిమళాలు’ పుస్తకావిష్కరణ

హన్మకొండ కల్చరల్‌: నిబద్ధత క్రమశిక్షణ సంస్కారవంతమైన భాషతో చేసే రచనే గేయమని, సాహిత్య ప్రక్రియల్లో పాట చాలా గొప్పదని సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్‌ అన్నారు. శనివారం వరంగల్‌ హంటర్‌రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో తెలుగు సినిమా గేయ రచన సదస్సు, పీఠం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నోముల రాజు సంపాదకత్వంలో ప్రచురించిన సినీ గేయ వ్యాస సంకలనం ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా మౌనశ్రీ మల్లిక్‌, విశిష్ట అతిథులుగా కేయూ విశ్రాంత ఆచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు, జానపద గాయకులు పత్తిపాక సురేందర్‌, కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు గోవిందం లక్ష్మీనర్సయ్య గేయ రచనలపై ప్రసంగించారు. అనంతరం అతిథులు ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించి సంపాదకుడు నోముల రాజును అభినందించారు. పీఠం పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీఠం సిబ్బంది ఆమేర్‌ అలీఖాన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దామోదర్‌, సురేశ్‌, రవికుమార్‌, గోపాల్‌రెడ్డి, సతీశ్‌, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

కాళోజీ సెంటర్‌: విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని వరంగల్‌ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నరసింహమూర్తి సూచించారు. వరంగల్‌ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన టెన్త్‌ విద్యార్థులకు శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుడు భిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement