కాజీపేట: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఇద్దరు మైనర్లను శుక్రవారం న్యాయమూర్తి ఆదేశం మేరకు జువైనల్ హోమ్‌కు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీ ల్లో ఇద్దరు బాలురు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పిల్లలను జువైనల్ హోమ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు.
హసన్‌పర్తి: మండల కేంద్రంలోని తెలంగాణ బాలిక గురుకుల విద్యాలయంలో ఎలుకల దాడి ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల భవన స్లాబ్‌పై నాగుపాము బుసలు కొడుతున్నట్లు శబ్దాలు రావడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్‌క్యాచర్‌ను పిలిచారు. గంట పాటు యత్నించిన తర్వాత పాము చిక్కింది. సుమారు ఆరడుగుల పొడవు గల పామును నల్లగట్టులో వదిలారు. ఇదిలా ఉండగా నల్లగట్టుగుట్ట వద్ద పాము వదిలిపెట్టడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
8, 9 తేదీల్లో
మహిళా రైతు మేళా
హన్మకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రైతు మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు – వాటి పరిష్కారాలపై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, నేల–పర్యావరణ పరిరక్షణపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ఈకార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు మేళాలో పాల్గొనే మహిళా రైతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. దీంతో పాటు ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దామెర మండలంలోని పులకుర్తిలో పెరటి తోటలు, నాటు కోళ్ల పెంపకం, నిత్య జీవితంలో బలవర్ధక ఆహారం ప్రాధాన్యంపై మహిళా రైతులు – శాస్త్రవేత్తల ‘ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ ద్వారా సీతారాముల తలంబ్రాలు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ పార్శిల్ ద్వారా సీతారాముల కల్యాణం త లంబ్రాలు భక్తులకు అందించాలని నిర్ణ యం తీసుకున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజిన ల్ మేనేజర్ విజయభాను తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్‌ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎం భాను కిరణ్ తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు ప్రతీ ఇంటికి డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్‌లు, మోబైల్ ఫోన్, గూగుల్ బ్రౌజర్‌లో, అడ్రస్ బార్‌లో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ అని టైప్ చేసి తలంబ్రాలు బుక్ చేసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్స్ ఎస్.రామయ్య 91542 98759, సతీశ్‌కుమార్ 91542 98761, చైతన్య కుమార్ 91542 98766, ఎం.నవత 91542 98758ను సంప్రదించాలని కోరారు.


