మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు

Mar 2 2026 8:57 AM | Updated on Mar 2 2026 8:57 AM

మామిడ

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు

జనగామ: మామిడి పంట సంరక్షణకు సస్యరక్షణే మేలు. కాయ రాలిపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దిగుబడి వస్తుంది. జనగామ జిల్లాలో 85వందల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూత అనంత రం చిన్న కాయలు ఏర్పడే ప్రస్తుత దశలో ఫ్రూట్‌లె ట్‌ డ్రాప్‌ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవికాంత్‌ తెలిపారు. ఈమేరకు మామిడి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

కాయ రాలిపోవడానికి ప్రధాన కారణాలు..

పరాగసంపర్కం సరిగా జరగకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ మట్టితేమ, బోరాన్‌, పొటాష్‌ లోపాలు, త్రిప్స్‌, హాపర్‌ దాడులు, అలాగే పొడరీ మిల్యూ, అంట్రాక్నోస్‌ వంటి వ్యాధులు ప్రధాన కారణాలు.

నివారణ చర్యలు పాటించాలి..

నీటిపారుదల నిర్వహణలో బిందు సేద్యంతో రో జుకు 3 గంటల పాటు నీరు అందించడం, మల్చింగ్‌ చేయడం, నీటి కొరత, అధిక నీరు రెండింటినీ ని వారించాలి. పోషక నిర్వహణలో ఒకశాతం 19 :19:19 లేదా 13:0:45 నీటిలో కరిగే ఎరువులను స్ప్రే చేయాలి. బోరాన్‌ 0 .1శాతం( గ్రాముకు లీటర్‌) స్ప్రే చేయడం ద్వారా కాయరాలిపోవడం తగ్గిపోతుంది. అవసరమైతే మైక్రోన్యూట్రియొంట్స్‌ వినియోగం తప్పనిసరి.

గ్రోత్‌ రెగ్యులేటర్‌ వినియోగం..

ప్లానోఫిక్స్‌ 4.5 ఎంఎల్‌ను 25 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి.

కీటక–వ్యాధి నియంత్రణ..

త్రిప్స్‌, హాపర్‌ నివారణకు ఫైప్రోనిల్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ పురుగు మందులు ఉపయోగించాలి.

కాయ పరిమాణం పెంపునకు ప్రత్యేక సూచనలు..

పొటాష్‌ అధికంగా ఉండే 13:0:45 ఎరువును రెండు దఫాలుగా 10–15 రోజుల వ్యత్యాసంలో స్ప్రే చేయాలి. తగినంత సేంద్రియ ఎరువు, తేమ అందేలా సరైన నీటిపారుదల నిర్వహణ అవసరం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా స్ప్రే తప్పనిసరిగా ఉదయం 8 ముందు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే చేయాలి. కాగా, ఏమైనా సందేహాలుంటే రైతులు వెంటనే హార్టికల్చర్‌ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖ సూచించింది.

కాయ రాలిపోకుండా

జాగ్రత్తలు తీసుకోవాలి

పంట దిగుబడి కాపాడుకోవాలి

ఉద్యాన శాఖ అధికారి రవికాంత్‌

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు 1
1/2

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు 2
2/2

మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement