గోల్‌ సాధించారు.. | - | Sakshi
Sakshi News home page

గోల్‌ సాధించారు..

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

సివిల్‌ సర్వీస్‌.. ఇది పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ప్రతీ అభ్యర్థి కల. జాతీయ స్థాయిలో సేవ చేసేందుకు దోహదపడే ఐఏఎస్‌.. ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌ వంటి ఉన్నతస్థానాల్లో కొలువుదీరేందుకు దోహదపడేదే సివిల్స్‌. ఈ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో ‘గోల్‌’ సాధించారు. సివిల్స్‌ ర్యాంకులు సాధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన అభ్యర్థుల వివరాలతో ప్రత్యేక కథనం.

సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులు

ఉత్తమ ర్యాంకులతో కల సాకారం చేసుకున్న యువకులు

మొన్న గ్రూప్‌–1, ఇప్పుడు సివిల్స్‌

ఐనవోలు: ఐఏఎస్‌ లక్ష్యంగా కష్టపడి చదివిన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం– అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్‌ సివిల్స్‌లో 472వ ర్యాంకు సాధించారు. తెలంగాణ గ్రూప్‌–1 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సా ధించి సిద్దిపేట జిల్లా మార్కూర్‌ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూనే సివిల్స్‌కు ప్రి పేరై 472వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలి చారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఐటీ ఉద్యోగాని కి ఎంపికై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన విక్రమ్‌ ఐఏ ఎస్‌ తండ్రి సహకారంతో యూపీపీఎస్సీ పరీ క్షకు హాజరయ్యారు. ఈసందర్భంగా విక్రమ్‌ తండ్రి మల్లేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి తన కుమారుడు సివిల్స్‌ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.

ఐఏఎస్‌కు తరుణ్‌ తేజ ఎంపిక

కాజీపేట/విద్యారణ్యపురి: కాజీపేట 61వ డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌ కాలనీ–3కి చెందిన అట్ల తరుణ్‌ తేజ శుక్రవారం సివిల్స్‌ ఫలితాల్లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తరుణ్‌ తేజ తల్లి అమరావతి వర్ధన్నపేట మండలం రామ్‌ధన్‌తండాలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, తండ్రి రవీందర్‌ పంథినిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాజీపేట సెయింట్‌ గాబ్రియల్‌ హైస్కూల్‌లో టెన్త్‌ వరకు చదివిన తరుణ్‌.. ఇంటర్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదివారు. జేఈఈ మెయిన్స్‌లో అఖిల భారతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. అనంతరం ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్స్‌ రాశారు. తొలిసారి 770వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎంఎస్‌లో ఉద్యోగం సాధించారు. గతేడాది మరోసారి సివిల్స్‌ పరీక్ష రాసి ప్రస్తుతం 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామారం వీరి స్వగ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement