న్యూశాయంపేట/హన్మకొండ/పరకాల: ఉద్యోగులకు బీమా సౌకర్యంతో ధీమా కల్పించామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనియన్ బ్యాంక్ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్‌ఎం విజయభాను, యూబీహెచ్ జోనల్ మేనేజర్ టి.కామేశ్వర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.కమలాకర్.. ఆర్టీసీ ఉద్యోగి పుప్పాల రవి మృతిచెందగా అతడి సతీమణి లతాభవానికి రూ.కోటి బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం విజయభాను మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో నివాసం ఉంటూ పరకాల ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్న పుప్పాల రవి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ప్రమాద బీమా క్లెయిమ్ ద్వారా రూ.కోటి సాయాన్ని అందించినట్లు తెలిపారు. ఉద్యోగులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు తమ కుటుంబ భద్రత దృష్ట్యా బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్‌లో ఖాతా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ కె.భానుకిరణ్, పరకాల డిపో మేనేజర్ రామ్‌ప్రసాద్, వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత, పర్సనల్ ఆఫీసర్ డి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్ పాల్గొన్నారు.
వరంగల్ ఆర్‌ఎం విజయభాను


