నిట్‌లో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని 15 మంది విద్యార్థులు శనివారం అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చి కిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించినట్లు నిట్ యాజమాన్యం తెలిపింది. శని వారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకల్లో పాల్గొన్నారు. నిట్‌లో తిన్న ఆహారంతో నా, బయట ఏదైనా తిన్న ఆహారంతో అస్వస్థతకు గురయ్యారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముగిసిన ఎస్సీ
స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష
కేయూ క్యాంపస్ : ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్–1, 2, 3,4, బ్యాంకింగ్, తదితర ఉద్యోగాల పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి. నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా సంచాలకుడు జగన్‌మోహన్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్‌గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విధులు నిర్వర్తించారు. ఇందులో వంద మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు.
పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు
● ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మాజీ
వరంగల్ అర్బన్ : చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసే క్రమంలో పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు తప్పవని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆహార కల్తీ నియంత్రణ, వినియోగదా రుల మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా చికెన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడిని శుభ్రం చేసేందుకు పసుపు బదులు రంగు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇలా ఉపయోగించి విక్రయించిన మాంసం తినడం వల్ల ఉదరం, పేగు కేన్సర్ బారిన పడుతారన్నారు. అందుకే ఇక నుంచి చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసేందుకు పసుపు వాడాలన్నారు.
ప్రైవేట్ కళాశాలలో
షార్ట్ సర్క్యూట్
హసన్‌పర్తి: నగర శివారులోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్‌లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటనలో కళాశాల హాస్టల్‌లోని సామగ్రి పాక్షికంగా దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. పలివేల్పుల శివారులో కొంతమంది వ్యక్తులు కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం జూనియర్ ఇంటర్ పరీక్ష ఉంది. కింది అంతస్తులో విద్యార్థినులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకేసారి పై అంతస్తులో నుంచి మంటలు చేలరేగాయి. దీంతో విద్యార్థినులు ఆందోళనతో బయటకు పరుగులు దీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.
కట్టడాలను పరిరక్షించాలి
ఖిలా వరంగల్: వారసత్వ సంపద, చారిత్రక కట్టడా ల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చ ట్టం తీసుకురావాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి జనరల్ సెక్రటరీ మొ గిలిచెర్ల సుదర్శన్ కోరారు. వినియోగదారుల రక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ శివనగర్‌లోని వినియోగదారుల సమాఖ్య జిల్లా కార్యాలయంలో చిలువేర ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో సుదర్శన్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టాలు లోపభూయిష్టంగా అమలవుతున్నాయని అన్నారు. కల్తీ బారినపడి వినియోగదారులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారు. కాకతీయుల కోట, కట్టడాలను ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర విధ్వంసానికి గురి చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేసినా విధ్వంసాలు మాత్రం ఆగడం లేదని వా పోయారు. దిడ్డి లక్ష్మీనారాయణ, కార్తీక్, శ్రవణ్, వాసుకి, నరసింహం, సూర్యం పాల్గొన్నారు.
నిట్‌లో 15 మంది విద్యార్థులకు అస్వస్థత


